సీపీఐ పొత్తు వల్లనే కాంగ్రెస్ అధికారం.. చాడ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో సీపీఐ పొత్తుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీపీఐ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది అన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలనే ఉద్దేశంతో అవసరమైన పద్ధతుల్లో అడ్డదారులు తొక్కుతున్నారని తెలిపారు. బీజేపీ నరేంద్ర మోదీ మూడవసారి అధికారంలోకి వస్తే.. ఇప్పటికంటే దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర వహించి ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలను కలుపుకుపోవాలని చర్చలు జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించే ఆ దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.


కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలు విజయవంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. మరోవైపు ఖజానా దివాలా తీసిందని, కొత్త ప్రభుత్వంపై ప్రజలకు కొండంత ఆశ ఉందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష పూర్వకంగా కాకుండా నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తుందని భావిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సమయంలోనే ప్రగతి భవన్ ఇనుప కంచెలను తొలగించడం నేను ఆశ్చర్యపడ్డా అని అన్నారు ఇనుప కంచెలను తొలగించడంతో సంతోషపడ్డ అన్నారు. ఇది సీపీఐ ప్రధాన డిమాండ్ అన్నారు. సింగరేణి ఎన్నికల్లో కార్మికుల పక్షపాత సంఘాన్ని ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version