యూపీ అభివృద్ధికి అయోద్య స్పూర్తి : ప్రధాని మోడీ

-

అయోధ్యలో మహత్తర ఘట్టానికి సర్వం సిద్ధం అయింది. ఇవాళ అయోధ్యలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ప్రధాని. అదేవిధంగా అమృత్ భారత్ రైలును కూడా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మాట్లాడారు. వారసత్వం మనకు సరైన మార్గం చూపుతుంది. అయోధ్యను దేశ చిత్ర పటంలో సగర్వంగా నిలబెడుదాం. ఇప్పుడు అయోధ్య రాముడి కోసం పెద్ద మందరం సిద్ధం అయింది. చుట్టుపక్కల ప్రాంతాలతో అయోధ్యను అనుసంధానం చేస్తున్నామని పీఎం మోడీ తెలిపారు.

సరయూ తీరంలో కొత్త ఘాట్ల నిర్మాణం జరుగుతుంది. అయోధ్యలో కొత్త టౌన్ షిప్ నిర్మాణం జరుగుతోంది. తొలి అమృత్ రైలు అయోధ్య నుంచి ప్రయాణిస్తుంది. జనవరి 22న రాముడి ప్రతిష్టాపన రోజు భక్తులు అయోధ్య కు రావద్దని సూచించారు ప్రధాని మోడీ.  500 ఏళ్లు రాముడి ఆలయం కోసం పోరాటం చేశాం. ప్రపంచం మొత్తం అయోధ్య రామాలయం కోసం ఎదురుచూస్తుంది. ఆధునిక అయోధ్య స్థాపనకు అంకురార్పణ జరిగిందన్నారు. వందే భారత్, నమో భారత్ తరువాత అమృత్ భారత్ రైలును ప్రారంభించామని తెలిపారు ప్రధాని. యూపీ మొత్తం అభివృద్ధికి అయోధ్య స్పూర్తి అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయోధ్య కు వచ్చే ప్రతీ రామభక్తుడికి దర్శనం సులువుగా అయ్యేవిధంగా చేస్తామని తెలిపారు ప్రధాని. 

Read more RELATED
Recommended to you

Exit mobile version