తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్ రాబోతుంది : రాహుల్ గాంధీ

-

రాష్ట్రంలో పదేళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేశారని రాహుల్ గాంధీ అన్నారు. కార్యకర్తలే కాంగ్రెస్ బలం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్ రాబోతుంది అన్నారు. అందులో ప్రత్యర్థులు కొట్టుకుపోతారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను మా పార్టీ అమలు చేస్తోంది. ఇక్కడ అన్ని హామీలను అధికారంలోకి రాగానే నెరవేరుస్తామన్నారు. కేసీఆర్, మోడీ కలిసి సింగరేణిని అదానికి అమ్మాలనుకొని చూశారు. దానిని కాంగ్రెస్ అడ్డుకుందని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.

కేసీఆర్ కుటుంబం ప్రభుత్వంలోని కీలక శాఖలు తన ఆధీనంలో పెట్టుకున్నారు రాహుల్ ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కాదు.. రాజులా వ్యవహరిస్తున్నారు. ధరణితో ఎవ్వరికి లాభం జరిగిందని ఆయన ప్రశ్నించారు. మీ భూములు లాక్కున్నారు.. కాళేశ్వరం నుంచి మీకు లాభం జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్ రూంకి వచ్చింది. రూ.1లక్ష మాఫీ ఎంత మందికి అయింది అని రాహుల్ అడిగారు. సింగరేణి కార్మికులతో మాట్లాడినా.. సింగరేణి ప్రైవేటీకరణ కానివ్వాం.. అదానికి అమ్మే ప్రయత్నాలు జరిగాయి. దానిని మేమే అడ్డుకున్నామని రాహుల్ గాంధీ ఆరోపించారు. సింగరేణికి రక్షణగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version