మంత్రి కేటీఆర్ కి రేవంత్ రెడ్డి కౌంటర్

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ కి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని..? రాహుల్ గాంధీ ఎవరు ? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎవరో తెలియదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి రేవంత్ రెడ్డి ఇలా స్పందించారు.
సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ బిచ్చమెత్తుకునే వాళ్లు.. రాహుల్ కుటుంబం దేశం కోసం ప్రాణ త్యాగం చేసింది.

గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశారు. TSPSC ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లలో విక్రయించారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ కి ఐటీ ప్రాజెక్టులు, విమానాశ్రయం, మెట్రో రైలు మంజూరు చేసింది ఎవరు అని ప్రశ్నించారు. అదేవిధంగా నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులను నిర్మించింది ఎవరు అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version