హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై సీపీఐ నారాయణ కీలక కామెంట్స్ చేసారు. ఈ స్థలాలను నోటరీతో సంతకాలు పెట్టించి కొన్న వాళ్ళ పట్ల ఆలోచన చేయండి. వాళ్ళ నుండి రెగ్యులరైజ్ అయిన చేయండి. లేదంటే పరిహారంగా మరేదైనా చోట ఇవ్వండి. పేదలకు అమ్మిన వాళ్ళ పై.. అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పిన ఆయన రేవంత్ పులి మీద స్వారీ చేస్తున్నారు అని పేర్కొన్నారు.
హైడ్రా దీన్ని కొనసాగించాలి. కొనసాగిస్తేనే ప్రజలు స్వాగతిస్తూ ఉంటారు. అలా అని ఏకపక్షంగా కూల్చద్దు. కాంగ్రెస్ వాళ్ళవి కూడా కూల్చండి. నగరంలో MIN వాళ్ళు చేసినంత కబ్జా ఎవరు చేసుండరు అని నారాయణ అన్నారు. కాబట్టి వాళ్ళవి కూడా కూల్చలి. అయితే ప్రభుత్వ భవనాలు కూల్చడం ఎందుకు అని ప్రశ్నించిన ఆయన.. సివిల్ ఇష్యూ లలో కోర్టుల విధానం మారాలి అన్నారు. అలాగే తప్పు చేసిన వాళ్ళే కోర్టుకు పోతారు. కోర్టుకు ఎవరు పోయినా తప్పు చేసినట్లే.. నిజాయితీ పరుడు అయితే ఫైట్ చేస్తారు అని పేర్కొన్నారు.