కామారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. మహిళను నగ్నంగా మార్చి.. ప్రైవేట్ భాగంలో కారం పెట్టి దారుణంగా కొట్టారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
మహిళను నగ్నంగా మార్చి.. ప్రైవేట్ భాగంలో కారం పెట్టి దారుణంగా కొట్టిన సంఘటన కామారెడ్డి మాచా రెడ్డి మండలం అక్కాపుర్ లో జరిగింది. మొదటి భార్యతో దూరంగా ఉంటూ మరో మహిళతో నరేష్ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు.
అయితే.. నరేష్ మరో మహిళ తో సన్నిహితంగ ఉండగా మొదటి భార్య, ఆమె బంధువులు పట్టుకున్నారు. నరేష్ మరో మహిళతో సహా జీవనం చేస్తున్న ఇంటిపై మొదటి భార్య బంధువులు దాడి చేశారు. ఆ తర్వాత ఇద్దరినీ కట్టేసి కారం చల్లి చితకబాదారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.