హైదరాబాద్‌ లో మరో దారుణం..ఓ యువకుడిపై కత్తులతో దాడి

-

హైదరాబాద్‌ లో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు. పిల్లర్ నెంబర్ 96 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 96 వై ఫైబర్ సర్కిల్ ఎదురుగా నడిరోడ్డుపై హత్య చే శారు గుర్తు తెలియని వ్యక్తులు. కత్తులతో నరికి చంపి అక్కడి నుండి గుర్తు తెలియని వ్యక్తుల పరార్ అయ్యారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్.. పాత కక్షల కారణంగా హత్యా జరిగింద ? లేక ఇతర కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇకమృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు… హత్యా కేసు గా నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఓ గ్యాంగ్ గా ఏర్పడి పక్క స్కెచ్ వేసి రివెంజ్ తీసుకున్నాట్లూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version