న్యూ ఇయర్ ఈవెంట్లపై సైబరాబాద్ సీపీ షాకింగ్‌ నిర్ణయం

-

న్యూ ఇయర్ ఈవెంట్ల పై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. సిటీలో ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్ పై ఫోకస్ చేశారు పోలీసులు.సన్ బర్న్ లాంటి ఈవెంట్స్ లో డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిన్న సెక్రటేరియట్ లో జరిగిన మీటింగ్ లో సన్ బర్న్ లాంటి ఈవెంట్స్ పై స్ట్రిక్ట్ గా ఉండాలని పోలీసులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ఏరియాల్లో గతంలో సన్ బర్న్ ఈవెంట్స్ నిర్వహించింది.

Cyberabad CP Avinash Mahanti’s shocking decision on New Year events

ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు సన్ బర్న్ ఈవెంట్ కి ఆన్లైన్ లో అందుబాటులో టికెట్స్ వచ్చాయి. ఈ సారి న్యూ ఇయర్ కి సన్ బర్న్ కి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్న సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి…. సన్ బర్న్ ఈవెంట్ కోసం ఎలాంటి దరఖాస్తు రాలేదని వివరించారు. అనుమతి తీసుకోకుండా.. ఆన్లైన్ లో టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని.. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించామని తెలిపారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేనన్నారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version