PM MODI : క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

-

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పండుగ అందరికీ ఆనందం, శాంతి, శ్రేయస్సును అందించాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ సామరస్యం, కరుణస్ఫూర్తికి ప్రతీక. ప్రతి ఒక్కరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండే ప్రపంచం కోసం కలిసి పనిచేద్దాం. ప్రభువైన క్రీస్తు గొప్ప బోధనలను కూడా మనం గుర్తు చేసుకుందాం’ అని మోదీ ట్వీట్ చేశారు.

Prime Minister Narendra Modi wishes Christmas to the people of the country

ఇక అటు ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు చెప్పారు. క్రిస్మస్‌ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు చెప్పారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులు అందరికీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని, తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version