కాంగ్రెస్ పార్టీలోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాబోతున్నారు- దానం నాగేందర్

-

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చిట్‌చాట్‌ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి 20 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నారని బాంబ్‌ పేల్చారు. బిఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉంది.. కేసీఆర్ విధానాలే బిఆర్ఎస్ ను ముంచాయని ఫైర్‌ అయ్యారు. పోచారం చేరికపై దానం మాట్లాడుతూ… పోచారం శ్రీనివాస్ రెడ్డే కాదు.. చాలామంది బిఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారని బాంబ్ పేల్చారు.

Danam Nagender

గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని.. కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ చేరిక ఉంటుందని వెల్లడించారు. మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు…. సీఎం రేవంత్ రెడ్డి , సునీల్ కనుగోలు చేరికలపై రెండు మూడు రోజులుగా సీఎం నివాసంలో చర్చించారన్నారు.

పల్లా , ప్రశాంత్ రెడ్డి , హరీష్ రావు, కేటీఆర్ లు తప్పా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖాళీ అవుతారు…. హరీష్ రావు తో కొందరు బిజెపికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారని ఆరోపణలు చేశారు. బిఆర్ఎస్ పార్టీ అయోమయంలో పడింది… ప్రమాదం నుండి బయటపడే పనిలో ఎమ్మెల్యేలున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version