పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంటికి హరీష్ రావు

-

పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటికి వచ్చారు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు. నిన్నటి ఈడీ అధికారుల సోదాలపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బ్రదర్స్ ని అడిగి వివరాలు తెలుసుకున్న హరీష్ రావు…అనంతరం మాట్లాడారు. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ చేసి వేధిస్తున్నాయి…. మహిపాల్ రెడ్డి గారి నివాసంలో కనీసం డబ్బు, బంగారం కానీ అక్రమంగా దొరకలేదని వెల్లడించారు.
ప్రతిదీ ఐటీ రిటర్న్స్‌తో సహా పక్కా వివరాలతో స్పష్టంగా ఉన్నాయి.

Former Minister Harish rao on ED raids on BRS MLA Mahipal Reddy

ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? అంటూ ఫైర్‌ అయ్యారు. బీహార్, గుజరాత్ లలో నీట్ ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారని ఆగ్రహించారు. ప్రశ్నాపత్రాలు లీకవుతున్నా అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయటం లేదు… మన తెలంగాణ రాష్ట్రంలో లక్ష కుటుంబాలు నీట్ పరీక్ష వ్రాశారు, వారిభవిష్యత్తు అయోమయంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒత్తిడికి గురిచేస్తుంది….బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లు చుట్టూ తిరుగుతూ.. అధికారపార్టీ బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version