టీహబ్‌ పనితీరు దేశానికే ఆదర్శం : మంత్రి కేటీఆర్‌

-

డల్లాస్‌ వెంచర్‌ క్యాపిటల్‌తో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఇవాళ టీహబ్‌ ఒప్పందం చేసుకుంది. ఇండియా ఫండ్‌ పేరుతో టీహబ్‌కి డల్లాస్‌ వెంచర్‌ క్యాపిటల్‌ నిధులు సమకూర్చనుంది. ఈ సందర్భంగా డల్లాస్‌ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థకు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. అద్భుత పనితీరుతో ప్రారంభించిన ఏడాదిలోనే టీహబ్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్‌ అన్నారు. కొత్త అంకుర సంస్థలకు టీహబ్‌ చిరునామాగా మారిందన్నారు.

‘‘డల్లాస్‌ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ భారత్‌లో అనేక స్టార్టప్స్‌ నెలకొల్పింది. భారత్‌లో 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన గొప్పది. హైదరాబాద్‌లో సుమారు 6వేల స్టార్టప్‌లు ఉన్నాయి. భారత్‌ ఆర్థికంగా వృద్ధి చెందుతోంది. భారత్‌కు పెట్టుబడులు రాబట్టడం కష్టం కాదు. మంచి ఆలోచన ఉన్న స్టార్టప్‌లకు నిధులు ఇబ్బంది కాదు. అయితే, స్టార్టప్‌లను ఎలా నిర్వహిస్తారు? డబ్బు వృథా కాకుండా వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేస్తారనేదే ముఖ్యమైన అంశం. అనేక రంగాల్లో స్టార్టప్‌లు వస్తున్నాయి. భారత్‌లో మొదటి ప్రైవేటు రాకెట్‌ టీహబ్‌ నుంచే వచ్చింది. ‘ధ్రువ స్పేస్’ సైతం హైదరాబాద్ నుంచి వచ్చి మొదటి ప్రయోగంలోనే నానో రాకెట్స్‌ని విజయవంతంగా నింగిలోకి పంపించింది’’ అని కేటీఆర్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version