కౌశిక్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారు – దానం నాగేందర్

-

సోమవారం తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శించుకున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ సందర్భంగా దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని స్వామిని కోరుకున్నానని తెలిపారు.

తెలంగాణలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అరికపూడి గాంధీ పై విమర్శలు చేసిన కౌశిక్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు దానం. ఆంధ్రా, తెలంగాణ అంటూ చేసే కుట్రలను భగ్నం చేస్తామన్నారు. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని హితువు పలికారు.

జిహెచ్ఎంసి ఎన్నికలలో తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ కి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఇక హైడ్రాను రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం రేవంత్ రెడ్డి పటిష్టం చేశారన్న దానం.. చెరువులు అన్యాక్రాంతం అయిన ప్రాంతంలో భూములు కబ్జాకు గురి అయ్యాయని అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇతర ప్రాంతాలలో నివాసం ఏర్పాటు చేసే యువజనలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version