ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. అంతేకాదు.. అతను మంత్రిగా వ్యవహరిస్తున్న ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామపంచాయతీలలో గ్రామసభ నిర్వహణను వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తించింది.
దీనికి సంబంధించిన రికార్డు పత్రాన్ని, మెడల్ ను ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో వరల్డ్ రికార్డు యూనియన్ అఫీషియల్ రికార్డు మేనేజ్ మెంట్ క్రిస్టఫర్ టేలర్ క్రాప్ట్ డిప్యూటీ సీఎంకు అందజేశారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామసభలను గుర్తించింది. అందులో భాగంగా వరల్డ్స్ రికార్డు యూనియన్ ప్రతినిధి.. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామపాలన గుర్తిస్తున్నట్టు తెలిపారు.