. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లిన దానం నాగేందర్

-

రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల మధ్య రచ్చ నడుస్తోంది. గులాబీ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే సభ్వత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పార్టీ మారిన వారిపై వేటు వేయాలని స్పీకర్ కార్యదర్శికి నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తాను ప్రతిపక్షంలో ఉన్నానని అరికపూడి గాంధీ ప్రకటించడంతో కౌశిక్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి తెలంగాణ భవన్‌కు రావాలని ఆహ్వానిస్తానని చెప్పడంతో రచ్చ మొదలైంది. ప్రస్తుతం అరికపూడి నివాసం వద్ద హైఅల్టర్ కొనసాగుతోంది.శుక్రవారం ఆయన ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు.దీంతో నగరంలోని ఎమ్మెల్యే హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. అయితే,కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్ అరికపూడి ఇంటికి వెళ్లారు. తనను టిఫిన్ కోసం అరికపూడి ఆహ్వానిస్తే వెళ్లానని ఆయన చెప్పారు. కాగా, దానంను అనుమతించి, మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తారా? అని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version