SLBC: నెల రోజుల తర్వాత కానీ మృతదేహాలు తీయలేమంటూ క్లారిటీ ఇచ్చింది ఎన్డీఆర్ఎఫ్. టన్నెల్ లో చిక్కుకున్న వాళ్ళు ప్రాణాలతో ఉంటారని భావించలేమని… టన్నెల్ బోరింగ్ మిషన్ ను పూర్తిగా కట్ చేయాల్సిందేనని ఎన్టీఆర్‌ఎఫ్ పేర్కొందని అంటున్నారు. శిథిలాల తొలగించడానికి దాదాపు నెల రోజుల సమయం పడుతుందని…అప్పుడుగాని లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురాలేమని చెబుతున్నారు అధికారులు.
టన్నె ల్ లో 14 కిలో మీటర్ల ప్రాంతంలో ప్రమాదం జరిగితే అక్కడి నుంచి దాదాపు 500 మీటర్ల వరకు మట్టి, సిమెంట్ రింగుల శిథిలాలతో సొరంగం మూసుకుపోయిందని తెలిపారు. ఇదే ఇప్పుడు సహాయ చర్యలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని అంటున్నారు. సాధారణంగా సారంగంలోకి వెళ్లేందుకు, కార్మికులను, యంత్ర పరికరాలను తరలించేందుకు రైల్వే ట్రాక్ను ఏర్పాటు చేశారు.. దీంతో వేరే భారీ యంత్రాలు కూడా లోపలికి తీసుకుపోయే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. కూలిపోయిన శిథి లాలను తరలించాలంటే ప్రస్తుతం ఏకైక మార్గం రైల్వేట్రాక్. ఆ మార్గంలోనే శిథి లాలను బయటకు తీసుకురావాల్సి ఉంది. ట్రాక్ కూడా దాదాపు 2 కిలోమీటర్ల వరకు నీటిలో మునిగిందని అంటున్నారు. నడుము లోతు వరకు నీరు, బురద పేరుకుపోయిందని… ప్రమాదం జరిగిన ప్రాంతంలో కరెంటును కూడా పునరద్ధరించలేదని తెలిపారు.