తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ జర్నలిస్టుల వసూళ్ల దందా పంచాయితీ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయితీ నెలకొంది. ఎమ్మెల్సీ ఫలితాలపై ఆత్మ పరిశీలన చేసుకున్నారు తీన్మార్ మల్లన్న. మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధిస్తాననే దీమా వ్యక్తం చేశారు.. నల్గొండ నుంచి లీడ్ రాలేదని ఆరా తీయడంతో వెలుగులోకి వచ్చింది పైసల పంచాయితీ.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఓటర్ల కు డబ్బులు ఇస్తానని నమ్మించి తీన్మార్ మల్లన్న వద్ద రూ 60 లక్షలు వసూలు చేశాడట ఓ యూట్యూబ్ చానల్ జర్నలిస్టు. ప్రలోభాల బాధ్యతను జర్నలిస్టుకు అప్పగించారు తీన్మార్ మల్లన్న.. వసూలు చేసిన డబ్బుతో ఎన్నికల ముందు అజ్ఞాతంలోకి వెళ్లాడట జర్నలిస్టు.
సదరు జర్నలిస్టును దొరకబట్టి రెండు రోజులు నిర్బంధించింది తీన్మార్ మల్లన్న టీమ్. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని జర్నలిస్టు పై తీన్మార్ మల్లన్న టీమ్ ఒత్తిడి చేసిందని సమాచారం. డబ్బు మొత్తం ఓటర్లకు ఖర్చు పెట్టానంటూ లెక్కలు చూపుతున్నారు జర్నలిస్టు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ జర్నలిస్టుల వసూళ్ల దందా పంచాయితీ తెరపైకి వచ్చింది.