హైడ్రాకు మరిన్ని పవర్స్‌…ఇకపై పోలీస్ స్టేషన్ స్టేటస్ కూడా !

-

Decision to give police station status to HYDRA: హైదరాబాద్‌ లో చెరువులు, నాలాల కబ్జాను అరికట్టేందుకు హైడ్రాకు మరిన్ని పవర్స్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. హైడ్రా నీ బలోపేతం చేసే పనిలో సర్కార్ పడింది. హైడ్రా కి పోలీసు స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. పోలీస్ స్టేషన్ స్టేటస్ తో… నేరుగా హైడ్రా నే FIR నమోదు చేసే వేసులు బాటు కల్పించారు.

Decision to give police station status to HYDRA

ఇక దీనిపై ఒకటి..రెండు రోజుల్లో ఉత్తర్వులు కూడా రాబోతున్నాయి. హైడ్రా కూల్చిన భవనాల అనుమతులపైనా విమర్శలు వస్తున్నాయి. అనుమతి ఇచ్చిన అధికారుల పై చర్యలకు తీసుకునే అంశం పై సమాలోచనలు చేస్తున్నారు. ఉన్నతాధికారులతో చర్చించి అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోనున్నారు. కాగా, నిన్న అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version