కేటీఆర్ కు రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యుల తీరును తప్పుబట్టింది తెలంగాణ మహిళా కమిషన్. ఇందులో భాగంగానే..ఆరుగురు మహిళా కమిషన్ సభ్యుల కు నోటీసులు ఇచ్చింది. నోటీసులు జారీకి సెక్రటరీని ఆదేశించారు కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన కేటీఆర్ కు కమిషన్ కార్యాలయంలో రాఖీ కట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సభ్యులకు ముందే హెచ్చరించారు నేరేళ్ళ శారద.
కమిషన్ ప్రాంగణంలో మొబైల్ ఫోన్స్ అనుమతి లేకపోయినా సీక్రెట్ గా మొబైల్ ఫోన్ తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలను చిత్రీకరించడంపై సీరియస్ అయ్యారు. రాఖీ కట్టిన ఆరుగురు సభ్యులకు నోటీసులు ఇవ్వడంతో పాటు న్యాయ సలహా తీసుకుంటోందట కమిషన్. మహిళా కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని ఘాటు వ్యాఖ్యలు చేసారు. లీగల్ ఒపీనియన్ తర్వాత ఆరుగురు సభ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది కమిషన్.