మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకా అయిన హుజుర్‌నగర్ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చేతివృత్తుల దారులపై మున్సిపల్ అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారు. ఫుట్ ఫాత్ ఆక్రమించారంటూ జేసీబీలతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు అధికారులు.
తమను రోడ్డుపాలు చేయవద్దని నాయిబ్రాహ్మణుడి ఆవేదన వ్యక్తం చేశారు. జేసీబీకి అడ్డుగా రోడ్డుపై పడుకొని నిరసన తెలిపాడు.. షాప్ కూల్చివేశారని కంటతడి పెట్టుకున్నాడు. కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. గోడు వినకుండా ముందుకుపోతున్న మున్సిపల్ అధికారులు..మీకు ఇదే న్యాయమేనా అంటూ ప్రశ్నించాడు ఆ బాధితుడు.
ప్లీజ్ నా మంగలి షాప్ కూల్చకండి సార్
రోడ్డు పక్కన పని చేసుకునే వారి మీదేనా మీ ప్రతాపం
హుజూర్ నగర్లో కూల్చివేతలు
చేతి వృత్తిదారులపై అధికారుల ప్రతాపం
లబోదిబోమంటున్న బాధితులు
బ్రతుకుతెరువుపై కొట్టొద్దని వేడుకుంటున్న ఓ మంగలి షాప్ బాధితుడు
గోడు వినకుండా ముందుకుపోతున్న మున్సిపల్… pic.twitter.com/RQtLyLVxVZ
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2024