మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద కట్టడం కూల్చివేతలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, దక్షిణ తెలంగాణకి చెందిన ఒక కీలక మంత్రి జిహెచ్ఎంసి కీలక అధికారికి మౌలిక ఆదేశాలు జారీ చేయడంతో నిన్న కూల్చివేత జరిగినట్లు తెలుస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి ప్రహారి కూల్చివేత సమాచారం సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ పోలీస్ ఉన్నతాధికారులకు లేకపోవడం ట్విస్ట్. ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.
అయితే… కాంగ్రెస్ సీనియర్ నేత, దక్షిణ తెలంగాణకి చెందిన ఒక కీలక మంత్రి ఎవరు అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలోనే…. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి హేమంత్ బోర్కడే పై బదిలీ వేటు వేసింది రేవంత్ సర్కార్. జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత పై బల్దియా కమిషనర్ సీరియస్ అయింది.
ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా కూల్చేవేత చేయడంపై ఆగ్రహించింది సర్కార్. ఓ మంత్రి ఆదేశాలతో జిహెచ్ఎంసి అధికారుల కూల్చివేతలు జరిగాయంటూ ప్రచారం జరుగుతోంది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ ను జిఐడి కి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది సర్కార్. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బాధ్యతల నుంచి తొలగిస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు ఇచ్చారు.