ఖాజాగూడ చెరువులో హైడ్రా కూల్చివేతలు.. 20 దుకాణాలు !

-

2024 ఇయర్ ఎండింగ్‌లో కూల్చివేతలతో హడలెత్తిస్తోంది హైడ్రా. దీంతో బాధితులు..కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఖాజాగూడ చెరువు బఫర్ జోన్లో నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభించింది హైడ్రా. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. హడావుడిగా కూల్చివేతలు చేసి తమను రోడ్డు మీద పడేశారు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Demolition of structures in Khajaguda pond buffer zone

20కి పైగా దుకాణాలను తొలగించింది హైడ్రా సిబ్బంది. నోటీసు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. సామాన్లతో పాటు కూల్చివేతలు చేస్తున్నారు హైడ్రా అధికారులు. దుకాణాల్లో ఫ్రిజ్లు, టీవీలు, విలువైన సామాగ్రి ధ్వంసం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news