మాజీ మంత్రి పేర్ని నానిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. మచిలీపట్నం రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో మాజీ మంత్రి పేర్ని నానిని నిందితుడిగా చేర్చారు పోలీసులు. మొన్నటి వరకు మాజీ మంత్రి పేర్ని నాని పేరు లేదు. తాజాగా రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో మాజీ మంత్రి పేర్ని నానిని నిందితుడిగా చేర్చారు పోలీసులు.
A6గా పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు. అటు ముందస్తు బెయిల్ పై ఉన్నారు A1 పేర్ని జయసుధ. ఈ కేసులో ఇప్పటికే నలుగురు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు A6గా పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు. అయితే.. ఈ తరుణంలోనే…రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు నేపథ్యంలో వైసీపీ కీలక నేత పేర్ని నాని సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ కీలక నేత పేర్ని నాని. అటు మాజీ మంత్రి పేర్ని నానిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.