తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి

-

Deputy CM Bhatti  : తమ్మినేని వీరభద్రంను పరామర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పరామర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క….తమ్మినేని వీరభద్రం సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.

Deputy CM Bhatti visited Tammineni Veerabhadra

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ కో కన్వీనర్ అజ్మతుల్లా తదితరులు ఉన్నారు. అటు సీపీఎం తెలంగాణ రాష్ట్ర నాయకులు తమ్మినేని వీర భద్రంను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రి నందు పరామర్శించారు రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version