వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తులు కిక్కిరిసిరారు. దీంతో వేములవాడ రాజన్న దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా గోదాదేవి రంగనాదుల కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. దీంతో అధిక సంఖ్యలో తరలివచ్చింది భక్తజనం.
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీవేణుగోపాల స్వామివారి ఆలయంలో గోదాదేవి రంగనాథ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు అనంతరం కళ్యాణ తంతును నిర్వహించారు. రాచకొండ భాను చారి క్రాంతి దంపతులు కన్యదాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం పుష్య మాసంలో గోదాదేవి రంగనాదుల స్వామి వారి కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లు అర్చకులు తెలిపారు.