తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా.. ట్రాఫిక్ జామ్

-

సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు ఇవాళ తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని హైదరాబాద్ లోని లక్డీకాపూర్ లో పాఠశాల విద్యా ప్రధాన కార్యాలయం ముందు  ధర్నా నిర్వహించారు. దీంతో లక్డీకాపూల్ లో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులకు, ఉద్యోగులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా  ఉద్యోగులు మాట్లాడుతూ గత 11 ఏండ్లుగా సమగ్ర శిక్షలో సీఆర్పీలు, ఎంఐఎస్ కో ఆర్టినేటర్లు, ఐఈఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, మెసెంజర్లు, పీటీఐలు, కేజీబీవీ, యూఆర్ఎస్ బోధన, భోధనేతర సిబ్బంది ఉద్యోగులుగా పని చేస్తున్నామని తెలిపారు. 

 కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని.. వెంటనే కనీస పే స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, గ్రూపు ఇన్సూరెన్స్, నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలని.. విద్యాశాఖలో చేపట్టే ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని.. మరణించిన లేదా గాయపడిన ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీరికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపాడు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version