సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ పై డీకే అరుణ ఫైర్ అయ్యారు. సోనియా గాంధీ పుట్టిన రోజే అన్ని హామీలు
అమలు చేస్తాం అన్నారని గుర్తు చేశారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఒక్క ఇల్లు మొదల పెట్టలేదన్నారు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా..? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ సగం మందికి కాలేదన్నారు. సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం కర్నాటకలో డీకే శివకుమార్ ఫ్రీ బస్ ఎత్తేస్తాం అంటున్నారని తెలిపారు. గ్రామాలకు బస్సులు బంద్ చేసి ఫ్రీ బస్ అంటున్నారని అన్నారు. అన్ని అమలు చేస్తున్నాం అనడానికి సీఎం రేవంత్ కు సిగ్గు ఉండాలన్నారు.
ప్రధాని మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వైఫల్యాలు ఎత్తి చూపారన్నారు. రూ.500 రూపాయలకే సిలిండర్ లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ 375, మరి మీరిచ్చేది ఎంత..? అన్నారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లు అన్ని కేంద్రానీవే కదా? అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను భ్రమలో
ఉంచుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ప్రజలు మేల్కొన్నారు. రైతు భరోసా లేదు, కౌలు రైతులకు, కూలీలకు సాయం దిక్కు లేదన్నారు. కాలేజీ చదివే అమ్మాయిలకు స్కూటీ లు ఎటు పాయే
అన్నారు. 11 నెలలో 50 వేల ఉద్యోగాల భర్తీ మాట పెద్ద బోగస్ అన్నారు. రూ. 10 లక్షల రూపాయల వైద్యం ఈ పది నెలల్లో ఎంతమందికి, ఎక్కడెక్కడ చేయించారో బయట పెట్టండి అన్నారు. చెప్పిన మాట నిలబెట్టు కోకుండా దబాయించాలని చూస్తున్నారని అన్నారు. కొత్తగా ఒక ఫించను దరఖాస్తు కూడా తీసుకోలేదు. కొత్త వితంతు పించన్లు రాక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.