కాంగ్రెస్‌ అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు కేసీఆర్‌ యత్నం: డీకే శివకుమార్‌

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తుదిఘట్టానికి వేళయింది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన వేళ ఎన్నికల అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లపై ఫోకస్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు పాల్పడే అవకాశం ఉందని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకోసం ఈసీ అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ తమ ఎమ్మెల్యేలను ట్రాప్ చేయకుండా నిలువరించాలని ఈసీని కలిసి విజ్ఞప్తి చేయనున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ స్వయంగా సంప్రదించినట్లు తమ పార్టీ అభ్యర్థులు చెప్పారని అన్నారు. గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం రాదని ఈ సందర్భంగా డీకే శివ కుమార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version