సీఎం ఎంపికపై ఖర్గే నిర్ణయాన్ని శిరసావహించాలని తీర్మానం: డీకే శివకుమార్‌

-

కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ముగిసింది. హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమై సీఎల్పీ నేత ఎంపికపై చర్చించారు. ఈ భేటీలో సీఎల్పీ నేత ఎంపికకు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడిన నివేదికను అధిష్ఠానానికి పంపనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం సీఎల్పీ నేత ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ క్రమంలోనే సాయంత్రానికి సీఎం ప్రమాణస్వీకారం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు సీఎల్పీ సమావేశానికి ముందు కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ భేటీ అయ్యారు. పార్క్‌ హయత్‌ హోటల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి సోదరులతో వివిధ అంశాలపై డీకే చర్చలు జరిపారు.

భేటీ అనంతరం పరిశీలకుడు, కర్ణాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నామని..సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఖర్గేకే ఇవ్వాలని ఎమ్మెల్యేలు చెప్పారని డీకే తెలిపారు. ఖర్గే నిర్ణయాన్ని శిరసావహించాలని తీర్మానం చేసినట్లు ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version