రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. వివిధ శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ స్వీకరిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, సంక్షేమ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అద్దెలు, డైట్ చార్జిలు పెండింగ్ లో పెట్టవద్దని అధికారులకు సూచించారు. అటవీ భూముల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారులు హాస్టల్లో పర్యటన నిరంతరం కొనసాగేలా ప్రయత్నించాలని సూచించారు.