గ్రూపు-2 అభ్యర్థులకు అలెర్ట్.. ఏపీపీఎస్సీ కీలక ప్రకటన

-

రాష్ట్రంలో APPSC 2023వ సంవత్సరంలో డిసెంబర్ 7వ తేదీన గ్రూప్-2 నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2024, ఫిబ్రవరి 25వ తేదీన ఈ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ర్వహించారు. ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడిన అనంతరం మెయిన్స్ పరీక్షలు పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జామ్స్ ఎల్లుండి  ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్ లైన్ లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు APPSC తెలిపింది.

ఇదిలా ఉంటే.. గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్స్  పోస్ట్ పోన్ చేయాలంటూ అభ్యర్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో నేడు హైదరబాద్ లో అశోకనగర్ లో స్టడీ సెంటర్లో ఆందోళనకు దిగారు. మరో పక్క గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్స్ పై ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు రాయనున్న అభ్యర్థులను APPSC అలర్ట్ చేసింది. మరోసారి పోస్ట్, జోనల్ ప్రిఫరెన్స్ ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. పరీక్షల అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులు ఫైనల్ సెలక్షన్ కోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలోనూ కచ్చితంగా మరోసారి పోస్ట్, జోనల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి 92,250 మంది మెయిన్స్ పరీక్షలు రాయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version