50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించలేక పోయిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు తెలంగాణ కోసం గొంతు ఎత్తింది ఎవరో ఉద్యమకాలంలో నేతల కాళ్ళ దగ్గర కూర్చున్న ఎవరో గుర్తు చేసుకోవాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల కరెంటు లేదు కానీ తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తున్నామన్నారు.
తెలంగాణలో మూడు కోట్ల తన్నులు ఓరి పండుతోందని రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని పేర్కొన్నారు. ఊటకొక పార్టీ మారే వాళ్లకు సిద్ధాంతాలు ఉండవన్నారు. డబ్బు మదంతో పని చేసే వాళ్లకు బుద్ధి చెప్పాలన్నారు. పాలమూరు రంగారెడ్డి పూర్తయితే శివన్నగూడెం ప్రాజెక్టుకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గం లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని తెలిపారు ఉపఎన్నికలో చూపించిన చైతన్యాన్ని మునుగోడు ప్రజలు మళ్ళీ చూపించాలన్నారు. చైతన్యవంతులైన నల్గొండ ప్రజలు ధన బీహార్లను తరిమికొట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.