మరో వివాదంలో ఎమ్మెల్యే ఆదిమూలం.. మరో మహిళతో ఆడియో వైరల్!

-

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఓ మహిళ కేసులో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం … ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. కోనేటి ఆదిమూలం ఒక మహిళతో ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ పర్సనాలిటీ చాలా బావుందని చెబుతున్న’’ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.

అయితే.. ఈ ఆడియో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దేనా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇది ఇలా ఉండగా… మహిళ కార్యకర్తపై లైంగిక దాడి చేసిన కేసులో.. ఎమ్మెల్యే ఆదిమూలంపై గత నెలలో కేసు నమోదు అయింది. దింతో తెలుగుదేశం పార్టీ నుంచి ఆదిమూలంను బహిష్కరించారు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అనంతరం ఆయన రాజీనామా చేస్తారని కూడా ఆ వార్తలు వచ్చాయి. కానీ ఇంతలో ఈ కేసు కాంప్రమైజ్ కు వచ్చినట్లు సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version