దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్

-

దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కు ఊహించిన షాక్‌ తగిలింది. తాజాగా దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యాడు. తాజాగా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో ఎమ్మెల్యే పర్యటన ఉన్నందున కారులో మాదాపూర్ స్వగృహం నుంచి దుబ్బాకకు బయలుదేరుతున్న క్రమంలో హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.

Dubbaka BRS MLA Kota Prabhakar Reddy house arrest

కాంగ్రెస్ పాలన పోలీస్ రాజ్యంగా మారిందని ఈ సందర్భంగా మండిపడ్డారు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.  ఇక అటు కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల ఏర్పాటు నిరసిస్తూ.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. అయితే పాదయాత్రకు పోలీసులు బ్రేకులు వేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. వాస్తవానికి పాదయాత్రకు అనుమతి లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు పోలీసులు. పట్నం నరేందర్ రెడ్డిని కోడంగల్ నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక  అక్కడి నుంచి షాద్‌నగర్ వైపు మళ్లిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news