తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి గణపతి నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా… లడ్డు వేలం కార్యక్రమం కూడా.. చాలా అట్టహాసంగా జరుగుతోంది. ఇప్పటికే బాలాపూర్ లడ్డు 30 లక్షలకు పైగా.. బిజెపి పార్టీ నేత కొలన్ శంకర్ కైవసం చేసుకున్నారు. అదే సమయంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో లడ్డూ వేలం ధరలు రికార్డులను అందుకుంటున్నాయి.
తాజాగా దుండిగల్ లో నాలుగు లక్షల రూపాయలకు.. ఇంద్రకంటి కిరణ్ అనే వ్యక్తి కైవసం చేసుకున్నారు. దుండిగల్ లోని వీరాంజనేయ స్వామి దేవాలయ గణపతి లడ్డును నాలుగు లక్షలకు కైవసం చేసుకున్నారు ఇంద్రకంటి కిరణ్. స్థానికంగా.. పంతులుగా కిరణ్ చాలా పాపులర్.
అయితే..గణపతి లడ్డు కొనుగోలు చేస్తే.. ఆరోగ్యం అలాగే సిరిసంపదలు.. కురుస్తాయని అందరూ చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే నాలుగు లక్షలు పెట్టి మరి గణపతి లడ్డును కైవసం చేసుకున్నారు పంతులు కిరణ్. ఇక ఈ వేలంలో.. వందల సంఖ్యలో భక్తులు… పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. రికార్డ్ స్థాయిలో లడ్డూను కైవసం చేసుకోవడం తనకు.. ఆనందాన్ని ఇచ్చిందని… గణపతి కృప తనపై ఉందని వెల్లడించారు.