ఎమ్మెల్సీ కవిత భర్త అనీల్ కి ఈడీ నోటీసులు

-

లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శనివారం రిమాండ్ విధించింది. అలాగే ఈడీ కస్టడీకి సైతం అనుమతించింది. అయితే రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు పలు కీలక అంశాలను పొందుపర్చారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, ప్రధాన కుట్రదారు అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనీల్ కి ఈడీ నోటీసులు అందించింది. పీఆర్ఓ రాజేష్ తో పాటు మరో ముగ్గురికి ఈడీ నోటీసులను అందించింది. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫోన్లను సీజ్ చేశారు ఈడీ అధికారులు. నిన్న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. అనీల్ వ్యాపార లావాదేవీలపై కూడా ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. సోమవారం విచారణకు హాజరు కావాలని పేర్కొంది ఈడీ. ఈ కేసులో ఇంకెవ్వరెవరు నిందితులుగా ఉన్నారనేది త్వరలోనే తేలనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version