మల్లారెడ్డికి బిగ్‌ షాక్‌..ఈడీ నోటీసులు జారీ !

-

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు. పీజీ మెడికల్ సీట్లు అక్రమాలపై నోటీసులు ఇచ్చారట ఈడీ అధికారులు. గత ఏడాది జూన్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి పై సోదాలు చేశారు ఈడి అధికారులు. 12 మెడికల్‌ కాలేజీల్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు.

ED officials served notices to former minister Mallareddy

పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై వివరణ కోరుతూ తాజాగా నోటీసులు అందించారు ఈడీ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 45 సీట్లు బ్లాక్ చేసి అమ్మకున్నట్లు ఈడీ గుర్తించింది అని చెబుతున్నారు. ఇందులో ఏది వాస్తవమో తెలియదు కానీ… తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి దీనిపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version