వచ్చే ఏడాది బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. మరోవైపు కొత్త ఛీప్ గా తిరిగి కేసీఆర్ ను ఎన్నుకుంటారా..? లేక కొత్త నాయకుడు వస్తారా..? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇది కాంగ్రెస్ ఢోకా నామ సంవత్సరం అని విమర్శలు చేసారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ కోసం నిలబడ్డారని తెలిపారు.
మరోవైపు హైదరాబాద్ పేరు ప్రతిష్ట.. తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు తాము చేసిన ప్రయత్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరిగే అవకాశమే లేదన్నారు. ఇతర కేసుల్లో మాదిరి కాకుండా ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుందన్నారు.