కొమురం భీం జిల్లాలో ఏనుగు భీభత్సం..ఇద్దరు రైతులు

-

తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది ఏనుగు దాడిలో ఏకంగా ఇద్దరు రైతులు మరణించారు. ఈ సంఘటన కొమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరెపల్లికి చెందిన అన్నూరి శంకర్ బుధవారం తన మిరపతోటలో పనిచేస్తున్నాడు.

Elephant terror in Komuram Bhim district Two farmers

ఈ క్రమంలో ఓ ఏనుగు ఒక్కసారిగా మిరప చేనులో దిగి అక్కడే ఉన్న అన్నూరి శంకర్‌(రైతు)పై దాడి చేసి చంపేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. అయితే.. ఇదే సంఘటనలో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఏనుగు దాడిలో మరో రైతు మృతి చెందాడు. అంటే గత 24 గంటల్లో ఏనుగుదాడిలో ఇద్దరు మృతి చెందారన్న మాట. ఈరోజు ఉదయం 5 గంటలకు పోషన్న అనే రైతు పొలానికి వెళ్తుండగా దాడి చేసి చంపింది ఏనుగు. దీంతో కొమురం భీం జిల్లాలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version