రేవంత్ ను మార్చేందుకే..తెలంగాణకు మీనాక్షి వచ్చారంటూ బాంబ్ పేల్చారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిత్యం ఏదో ఒక సంచలన అంశంతో… రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అయితే… తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సీటుకే ఎసరు పెట్టాడు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చేందుకే.. తెలంగాణకు మీనాక్షి నటరాజన్ వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉత్తమ్ కుమార్ మాస్టర్ ప్లాన్లోలో భాగంగానే.. కాంగ్రెస్ ఇన్ఛార్జి మార్పు జరిగినట్లు పేర్కొన్నారు. జూన్-ఆగస్టు మధ్య.. తెలంగాణలో ముఖ్యమంత్రి ఖాయమంటూ కుండబద్దలు కొట్టారు. సీఎం ఛేంజ్ అనే మిషన్ని మీనాక్షికి రాహుల్ టీమ్ అప్పగించింద ని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సీఎంని మార్చేందుకే ఇప్పటికే మీ నాక్షి గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారని వెల్లడించారు.