జేసీబీని నడిపిన బాలుడు.. అదుపుతప్పి యాక్సిడెంట్

-

జేసీబీని బాలుడు నడిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. తవ్వకాలు జరిపే జేసీబీని డ్రైవర్ పక్కన పార్క్ చేసినట్లు తెలిసింది.

అయితే, కీని జేసీబీకే వదిలేసినట్లు సమాచారం.ఈ క్రమంలోనే 17 సంవత్సరాల మైనర్‌ బాలుడు ఎవరూ చూడని సమయంలో జేసీబీ ఎక్కి దానిని స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా జేసీబీ మీద అదుపు కోల్పోవడంతో రోడ్డు పక్కనే పార్క్‌ చేసిన ఆటోలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలు ఆటోలతో పాటు బైకులు,కారు ధ్వంసమయ్యాయి. స్థానికులు ఆ బాలుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

https://twitter.com/ChotaNewsApp/status/1896729807913713754

Read more RELATED
Recommended to you

Latest news