Enumamula Agriculture Market: వరంగల్ ఎనమల వ్యవసాయ మార్కెట్ లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వరంగల్ ఎనమల వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. పత్తి రేటు తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. రెండు రోజుల సెలవులు అనంతరం సోమవారం ప్రారంభం అయిన వ్యవసాయ మార్కెట్ కు ఎక్కువ మొత్తంలో పత్తి నీ తీసుకువచ్చారు రైతులు.
పత్తి బస్తాలు ఎక్కువ రావడంతో 6800 జెండా పాట పలకడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. క్వాలిటీ పత్తికి 6,800 అయితే…. తేమ తో ఉన్న పత్తికి 5500 ధర పలకడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ తీసుకొని పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. దీంతో వరంగల్ ఎనమల వ్యవసాయ మార్కెట్ లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.