రాష్ట్రంలో ప్రస్తుతం జన్వాడ్ ఫాంహౌస్ పార్టీ గురించే టాపిక్ నడుస్తోంది.అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశాయి. ముఖ్యంగా కేటీఆర్‌ను టార్గెట్ చేసి డ్రగ్స్ వ్యవహరం లెక్క తేల్చాలని అటు మంత్రులు, కేంద్రమంత్రి బండి సంజయ్ సైతం అధికార యంత్రాంగాన్ని కోరారు.ఇదిలాఉంటే ఇదంతా కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడిన డ్రామా? అని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత (యూఎస్‌ఏ) హరీశ్ రెడ్డి కేంద్రమంత్రి బండి సంజయ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కరీంనగర్ అరగుండు సబ్జెక్టు లేని సన్నాసి, తలాతోకా తెల్వకుండా నోటికి ఏది వస్తే అది ఒర్రే తెలివితక్కువ మనిషికి తన శాఖలోనే ఉన్న నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు గురించి ఆకు తెల్వదు, తోక తెల్వదు.
నీకు దమ్ముంటే నీ శాఖలో ఉన్న సిబ్బందిని పంపి హైద్రాబాద్లో ఎక్కడ డ్రగ్స్ లభ్యమవుతున్నాయి అనేది కనుక్కో.అది పక్కనపెట్టి పిచ్చోని లెక్క ఒర్రుడొకటి బాగా నేర్చినవ్. కరీంనగర్ ప్రజలు ఈ సారి పక్కా నిన్ను రాజకీయ సమాధి చేసుడు మాత్రం ఖాయం’ అని విమర్శలు చేశారు.