ట్రోలింగ్ చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఏపూరి సోమన్న.. దమ్ముంటే ముందుకు రండి !

-

ట్రోలింగ్ చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఏపూరి సోమన్న.. దమ్ముంటే ముందుకు రండి అని పోస్ట్ పెట్టారు. ఏ పార్టీనీ నిందించాలి అనేది నా ఉద్దేశ్యం కాదు , నా పాటను మాటను వాడుకున్న పార్టీలు నాకేం న్యాయం చేశాయి , ఒకవేళ నేను అమ్ముడుపోయే వ్యక్తిని అయితే నా ముందు నా వెనుక ఉన్న ఆస్తులు కూడా బహిర్గతం చెయ్యండని సవాల్ చేశారు. నన్ను , నా పాటను వాడుకున్న పార్టీలు గతంలో నాకు ఎంత ప్యాకేజీ ఇచ్చినాయో అది కూడా బహిర్గతం చేయండన్నారు.

Epuri Somanna

నేను 26 ఏండ్ల ప్రజా ప్రస్థానంలో ఉద్యమ పాట , ప్రజా పోరు పాట , ప్రజల హక్కుల పాటను , ప్రశ్నించే పాటను , ప్రజా చైతన్య పాటను ఎత్తుకుని ఊరూవాడా తిరగాడాను , నాపై దూషణ చేస్తున్న మిత్రులలో ఏనాడు ఏ ఒక్కరూ సోమన్న ఇది చేసిండు మీ పార్టీకి సోమన్న కు ఇది చేయండి అని ఎందుకు అడగలేదని వెల్లడించారు. ఈరోజు నా తరపున ఏనాడు మాట్లాడని కొద్ది మంది కట్టగట్టుకుని నా మీద దూషణలకు దిగుతూ మానసిక విష ప్రయోగానికి సిద్ధమైన కూడా ప్రేమతో వాళ్లకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు ఏపూరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version