హరీష్ రావుతో ఈటల రాజేందర్..ఫోటో వైరల్ !

-

తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావుతో… బిజెపి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోమవారం రోజున రాత్రి… గులాబీ పార్టీ నేతలు అలాగే బిజెపి నేతలు ఓ ఈవెంట్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ ఈ నాయకులందరూ అనుకోకుండా కలుసుకున్నారు.

etala

ఈ సందర్భంగా సెల్ఫీలు దిగారు నేతలు. ముఖ్యంగా గులాబీ పార్టీలో అప్పట్లో తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు అలాగే బిజెపి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ కలిసికట్టుగా పనిచేసేవారు. దీంతో వీరిద్దరు కూడా సెల్ఫీ దిగడం జరిగింది. అయితే గులాబీ పార్టీ నేతలు ఈ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేసి… పాత మిత్రులు కలిసిన వేళ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరి కొంతమంది… గులాబీ పార్టీకిరావాలని ఈటెల రాజేందర్ ను కోరుతున్నారు. కాగా రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గులాబీ పార్టీని వీడారు ఈటల రాజేందర్. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి ఇప్పుడు పార్లమెంటు సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు ఈటల.

Read more RELATED
Recommended to you

Exit mobile version