వంకర టింకర మాటలు ఆపండి అంటూ…రేవంత్ కు ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మంలో ఎంపీ ఈటల మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరి 10నెలల అవుతుంది…ప్రభుత్వ ఆదాయం రోజు రోజు కి తగ్గుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్లనేనని.. హైడ్ర, మూసి ప్రక్షాళన వల్లనే అంటూ ఆగ్రహించారు. హైదారాబాద్ లో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు సన్నగిల్లి పోతున్నాయని మండిపడ్డారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలైందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహించారు. ఆరు గ్యారెంటీ లలో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం తప్పితే మిగతా గ్యారెంటీ లు ఇంప్లిమెంట్ కాలేదు… రైతు రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా చేస్తామని చెప్పి మాట తప్పారని నిప్పులు చెరిగారు. ఒకేసారి రుణామాఫీ చేస్తామని చెప్పి 17వేల కోట్లు మాత్రమే విడుదల చేశారు…రైతాంగం ఆందోళన లో ఉందని వెల్లడించారు. రైతు బంధు ఉసే లేదు…కౌలు రైతుల ఉసు లేదు… ప్రభుత్వంను మీము ఒక్కటే డిమాండ్ చేస్తున్నామన్నారు.