బండి సంజయ్‌ అధ్యక్షుడిగానే కొనసాగుతారు..ఎలాంటి మార్పు ఉండదు – ఈటల

-

బండి సంజయ్‌ అధ్యక్షుడిగానే కొనసాగుతారు..ఎలాంటి మార్పు ఉండదని కుండబద్దలు కొట్టి చెప్పారు ఈటల రాజేందర్‌. మా పార్టీ అధ్యక్షుడు మార్పు విషయం లో గతంలో నే వార్తలు వచ్చాయి.. ఎలక్షన్ దగ్గర ఉన్న ఈ సమయంలో మార్పులు ఉండకపోవచ్చని వెల్లడించారు. నన్ను ఎలా వాడుకోవలో అని అధిష్టానం ఆలోచిస్తుందని చెప్పారు ఈటల.

పార్టీ లో ఉన్న పాత వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త వారికి ఘర్షణ వాతావరణం ఉండడం సహజం అన్నారను. పాత కొత్త అని బేదం ఉండకూడదు అని అధిష్టానమే చెబుతోంది.. ప్రజా క్షేత్రం లో పేరున్న వారికే టికెట్లు వస్తాయని వెల్లడించారు. పొంగులేటి, జూపల్లి ని ఈ మధ్య బీజేపీ పార్టీ లో చేరమని అడిగానని.. మా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం అన్నారని ఈటల స్పష్టం చేశారు. రేపు కాంగ్రెస్ బి ఆర్ ఎస్ కలుస్తాయి ఏమో అని ప్రచారం జరుగుతోందlr.. మా అధ్యక్షుడు బాగానే పని చేస్తున్నారన్నారు. బీజేపీ తెలంగాణ లో గెలవాలి అంటే ఇంకా శక్తి కావాలి అంటున్నామని చెప్పుకొచ్చారు ఈటల రాజేందర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version