ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు – దగ్గుపాటి పురంధేశ్వరి

-

ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని రాయచోటిలో ఏపీ ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురంధేశ్వరి. ఏపీలో ఆందోళనకరంగా పరిస్థితి నెలకొంది…అరాచక, విధ్వంసం పాలన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆర్థికంగా చూస్తే ఊబిలోకి నెట్టివేసినట్లు ఇవాల ఆంధ్ర రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉంది… కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కూడా అర్హులైన లబ్ధిదారునికి ఆ సహకారాన్ని అందించకుండా వచ్చే నిధులన్నీ దారి మల్లించే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహించారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దీనావస్థలో ఉందంటే చివరికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒకటవ తారీఖున జీతాలు ఇచ్చుకో లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉందంటే ఇది ఎంత బాధకరమో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరారు. పాపం ఉద్యోగస్తులందరూ కూడా వాళ్లు ఈ జీవితం మీద ఆధారపడి తీసుకున్నటువంటి వస్తువులు కూడా బ్యాంకులు దగ్గరకు వెళ్లి అయ్యా బాబు మా ఈఎంఐ ఉంది కొంచెం మీరు కాస్త వెసులబాటు కల్పించండి అని చెప్పి ప్రాధేయపడే పరిస్థితిల్లో ఇవాల ఉద్యోగులు ఉన్నారన్నారు. కేంద్రం గ్రామాలకు ఇస్తున్నటువంటి సహకారం 15 ఆర్థిక కమిటీ కింద వారు ఇచ్చేటువంటి సహకారాన్ని డైరెక్ట్ గా గ్రామాలకు ఇస్తూ ఉంటే వాటిని కూడా తీసేసుకుని ఇవాల ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్ళీంచే పరిస్థితి ఉందని పేర్కొ న్నారు. ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి లేదని నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version