వైఎస్ఆర్ ఇచ్చిన ఉచిత విద్యుత్ కూడా అంతంత మాత్రమే – ఎంపీ రంజిత్ రెడ్డి

-

పరిగి: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు ఎంపీ రంజిత్ రెడ్డి. రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతదనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం అన్నారు. వరంగల్ డిక్లరేషన్ లో ఉచిత విద్యుత్ ప్రస్తావన లేదన్నారు. నాడు వైఎస్ఆర్ ఇచ్చిన ఉచిత విద్యుత్ కూడా అంతంత మాత్రమేనని.. ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చేదన్నారు. కరెంట్ ఎప్పుడొస్తాదో తెలీక నాడు రాత్రిళ్ళు పాము కాటుకు గురై రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారని పేర్కొన్నారు.

14 ఏళ్ల ఉద్యమంలో కేసిఆర్ రైతుల బాధల్ని చూసి, చలించి నేడు ఉచిత విద్యుత్ ను 24 గంటలు ఇస్తున్నారని తెలిపారు. మూడు గంటల విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా..!? మూడు పంటల బీఆర్ఎస్ కావాలా….!? ప్రజలు తేల్చుకోవాలన్నారు. 24 గంటల విద్యుత్ వల్ల రైతులు తమకు అనుకూలమైన టైమ్ లో పొలం పారించుకునే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని రైతుల అవసరాల మేరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version