సికింద్రాబాద్ లో ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేసారు పోలీసులు. ఫేక్ ఓటర్ కార్డు, ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా ను పట్టుకున్నారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మహంకాళి పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి.. ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. ఆ ఆరుగురూ హైదారాబాద్ కి చెందిన వాళ్ళే. వందలాది ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. గెజిటెడ్ ఆఫీసర్స్ పేర్లతో నకిలీ స్టాంప్ లు కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితులు ఎలగం రాజ్ కుమార్, మహబూబ్, రాచమల్ల విజయ లక్ష్మి, కూరపాటి పల్లవి, బండి శంఖర్, గిరిరాజ్ అనిల్ కుమార్ అరెస్ట్ చేసారు.
ఈ అరెస్ట్ పై టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర మాట్లాడుతూ.. సికింద్రాబాద్ కి చెందిన ఎలగం రాజ్ కుమార్ 10 ఏళ్లుగా ఆన్లైన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇతని దగ్గర రాచమల్ల విజయ లక్ష్మి, పల్లవి పనిచేస్తున్నారు. తన ఆన్లైన్ సెంటర్ లో ఇద్దరు మహిళల సహాయంతో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నాడు. ఫేక్ ఆధార్ కార్డ్ లు, ఫేక్ ఓటర్ ఐడి, ఫేక్ పాన్ కార్డ్ లతో నకిలీ బర్త్ సర్టిఫికెట్లు క్రియేట్ చేస్తున్నారు. ఫేక్ ఓటర్ కార్డు లతో ఆధార్ కార్డుల్లో అడ్రస్ చేంజ్ లాంటివి చేస్తున్నారు. అధికారులకు తెలియకుండానే.. వాళ్ళ పేర్ల మీద నకిలీ స్టాంప్ లు తయారు చేసారు అని తెలిపారు.